18 April, 2026 | 7:02 PM

బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్

18-04-2026 05:59 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాలు నిండి 15 సంవత్సరాల లోపు వయస్సు గల 27 మంది బాలికలకు భవిష్యత్తులో గర్భాశయముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ఉండడానికి  హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పరీక్షల అనంతరం అత్యంత సురక్షితమైన, ఖరీదైన ఈ వ్యాక్సిన్ ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నాయని, ఈ వ్యాక్సిన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ చాలా వరకు తగ్గుతుందని హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుందని తద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని,

  ప్రస్తుతం 14 సంవత్సరాలు నిండిన బాలికలకు మాత్రమే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా  వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని లబ్ధిదారులైన బాలికలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, సూపర్వైజర్లు గుజ్జా విజయ, కౌశల్య సింగ్, నాగలక్ష్మి, కమల, రమాకుమారి, సులోచన, స్వప్న, చంద్రకళ, ఫార్మసీ ఆఫీసర్ కిరణ్ కుమారి , ఈ ఎం ఆర్ ఎస్  సిబ్బంది భవాని, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.