calender_icon.png 29 July, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

29-07-2025 12:33:23 AM

ఘట్ కేసర్, జూలై 28 : అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను అందించడం జరుగుతుందని ఘట్ కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. సో మవారం ఘట్ కేసర్ మున్సిపల్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆధ్వర్యంలో 3వ వార్డు పరిధిలోని ఎన్ ఎఫ్ సి నగర్, చందుపట్లగూడలో మున్సిపల్ మాజీ చైర్మన్ పావని జంగయ్యయాదవ్ బీబ్లా క్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్,

మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు మామిళ్ళ ము త్యాలు యాదవ్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు మంజూరు చేసి ఇండ్లను నిర్మించడం జరుగుతుందన్నారు. 

మేడ్చ ల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి సహకారంతోశంకుస్థాపనలు చేశామని తెలిపారు. ఈకార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ మల్లేష్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ,

వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్క సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి , మాజీ వార్డ్ సభ్యులు వి.బి. వెంకట్ నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శ మేకల సునీల్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సాయి చరణ్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు సత్తిరెడ్డి, భవాని, హీరాలల్, నర్సింహా రెడ్డి తదితరులుపాల్గొన్నారు.