29-07-2025 12:33:05 AM
కామారెడ్డి, జూలై 28 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్ పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ ప్రజావాణిలో ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ హనుమంతరావు పై సోమవారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రెడ్డిపేట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్,ఐడి,ధ్రువ పత్రాలను సృష్టించి కరడ్ పల్లి గ్రామంలో కళ్ళు దుకాణం లైసెన్సు పొందారని సంపత్ గౌడ్ ఆరోపించారు.
ఈ విషయంపై పలుసార్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారికీ ఆధారాలతో నిరూపించిన అతని లైసెన్స్ రద్దు చేయడం లేదని అన్నారు,ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి సూపరిండెంట్ వెంటనే కళ్ళు దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ హనుమంతరావు పట్టించుకోవడంలేదని ప్రజావాణిలో ఎక్సైజ్ సూపరిండెంట్ పైన ఫిర్యాదు చేశానని తెలిపారు.
గత వారం రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ సూపరిండెంట్ ను కలిస్తే రెసిడెన్సిల్ సర్టిఫికెట్ తీసుకువస్తే స్వామి గౌడ్ యొక్క లైసెన్సును రద్దు చేస్తానని, చెప్పాడని మళ్లీ మాట మారుస్తున్నాడని తెలిపారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని స్వామి గౌడ్ కళ్ళు దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని వేడుకున్నట్లు తెలిపారు.