calender_icon.png 29 July, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ రేషన్ కార్డులు

29-07-2025 12:34:34 AM

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి 

శంకర్ పల్లి , జులై 28: అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని మణి గార్డెన్ లో 157 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీవో చంద్రకళతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో 16,582 కొత్త కార్డులు అప్రూవల్ అయ్యాయని, ఇందులో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన 1,562 మంది లబ్ధిదారులు ఉన్నాయని చెప్పారు. మరిన్ని దరఖాస్తులు వస్తున్నాయని, అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోని వాళ్లు ఉంటే వెంటనే చేసుకోవాలని సూచించారు.

అలాగే అర్హత ఉన్న అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉ చిత ప్రయాణం, రూ.500 లకే వంట గ్యాస్ , 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘ నత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు.

అనంతరం 26 మంది లబ్ధిదారులకు రూ. 10.71 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మా ర్కెట్ కమిటీ పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి , వైస్ చైర్మన్ కాసెట్టి చంద్రమోహన్, మాజీ కౌన్సిలర్లు, లక్ష్మమ్మ రాంరెడ్డి , చంద్రమౌళి , అధికారులు, నాయకులుపాల్గొన్నారు.