16 April, 2026 | 2:08 AM

ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు

16-04-2026 12:00 AM

ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 

కొల్చారం, ఏప్రిల్ 15: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చూస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రభుత్వం మొదటి దశలో పూర్తిగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం అనేక నిబంధనలను, షరతులను విధించి సంఖ్యను తగ్గిస్తుంది అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇండ్లు నిర్మాణానికి అవసరమైన ఇసుకను పంపిణీ చేయాలని అన్నారు. ప్రస్తుతం నియోజకవర్గానికి 851 ఇండ్లు మంజూరు కాగా కొల్చారం మండలంలో 54 మంజూరైనట్లు వారందరికీ పట్టాలు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రవితేజ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజనేయులు, డీసిఎంఎస్ మాజీ ఉపాధ్యక్షుడు అరిగే రమేష్, మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, మేఘమాల సంతోష్, మాజీ సి డి సి చైర్మన్ నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, సర్పంచులు నిర్మల మల్లేశం, మోహన్, స్వామి, వినోద్ నాయక్, గీత రమేష్, ఏడుపాయల ఆలయ కమిటీ డైరెక్టర్ గౌరీ శంకర్  తదితరులు పాల్గొన్నారు.