సాంకేతిక పరిణామం మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి
యూనివర్సిటీ ఫౌండర్ సీహెచ్వీ పురుషోత్తం రెడ్డి
మొయినాబాద్ ఏప్రిల్ 15(విజయ క్రాంతి): సాంకేతిక పరిణామం మానవాళి ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్వీ పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్లో గల చైతన్య డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ యూజింగ్ మిషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అంశంపై గంధం విజయ్ కుమార్ చేసిన పరిశోధనకు పీహెచ్డీ డిగ్రీ ప్రదానం చేశారు.
బుధవారం జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్ సీహెచ్వీ పురుషోత్తం రెడ్డి అధికారికంగా డిగ్రీను అందజేశారు.ఈ పరిశోధన డాక్టర్ ఈ అరవింద్ పర్యవేక్షణలో పూర్తి అయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో పరిశోధనలు జాతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. మిషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ను ఉపయోగించి క్లౌడ్ సెక్యూరిటీ పరిష్కారాలపై పరిశోధన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ తరహా పరిశోధనలు దేశానికి గర్వకారణమే కాకుండా భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయని తెలిపారు. డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ సాత్వికా రెడ్డి, వైస్ ఛాన్సలర్ జీ శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఎం రవీందర్, క్రిస్టోఫర్, ఏ రాజు, ఎం జగదీశ్వర్, బి రాజేందర్ రెడ్డి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదే రాంబాబు రెడ్డి పాల్గొన్నారు.






