17 April, 2026 | 2:36 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇందిరమ్మ ఇండ్లు, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి

19-04-2025 10:40 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల సర్వే, రేషన్ కార్డుల సర్వే, త్రాగునీటి సమస్యలు వంటి అంశాలపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిరుపేదలకు ఇండ్లకు సిఫారసు చేయాలని సూచించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితులలో మంజూరు చేయరాదని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలని తెలిపారు.ప్రతీ కుటుంబానికి ఒక ఇళ్లు మాత్రమే మంజూరు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీ వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ/వార్డు సభలో లబ్ధిదారుల పేర్లు ఆమోదం పొందాలని తెలిపారు.

ఆర్థికంగా వెనుకబడిన వారికి స్వయం సహాయక గ్రూప్ నుండి ఒక లక్ష రూపాయలు రుణంగా మంజూరు చేయాలని తెలిపారు. రేషన్ కార్డుల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాలని, జిల్లాకు ఒక కోటి రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని, అట్టి నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన మరమ్మత్తులకు అట్టి నిధులు వినియోగించుకోవాలని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, డివిజనల్ పంచాయతీ అధికారి సురేందర్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.