30 March, 2026 | 7:24 PM

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక – ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

30-03-2026 06:13 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం భిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ముఖ్యంగా పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాన్ని నిర్వహించారు. సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ వినోద్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు గృహప్రవేశం జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ఇళ్లు అందించడం ప్రభుత్వం పేదల అభివృద్ధికి కట్టుబడి ఉందని నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్ల రాజా రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, డిసిసి కార్యదర్శి రాజబాబు గౌడ్, టెంపుల్ కమిటీ చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ దయాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. అలాగే విడిసి అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ డైరెక్టర్ తక్కల్ల బాపురెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏలేటి బాపు రెడ్డి, బత్తిని రాజేందర్, వార్డు సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.