28 August, 2026 | 1:56 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి

12-07-2026 11:18 AM

గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్

గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. శనివారం అంగడి బజార్ హరిజన కాలనీలో మంచినీటి బోరును  సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్‌ ప్రారంభించారు. గణపురం మండల కేంద్రంలోని అంగడి బజార్ ఎస్సీ కాలనీలో ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్  ఆధ్వర్యంలో పది రోజుల క్రితం మంచినీటి బోరు వేయగా సమృద్ధిగా నీరు పడడంతో శనివారం నూతన బోరు మోటర్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.