12 July, 2026 | 11:55 AM

సెంచరీ కంపెనీలో అగ్ని ప్రమాదం

12-07-2026 11:24 AM

జిన్నారం/అమీన్ పూర్: సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐడీఏ బొల్లారంలోని సెంచరీ పరుపుల (Century Mattresses) గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి, ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.సమీపంలో ఉన్న పరుపుల గోదాంలో మంటలు చెలరేగడం వల్ల దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.