7 July, 2026 | 3:57 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత

07-07-2026 02:42 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని వదల్పర్తి గ్రామంలో పూరి గుడిసెలు నివసించే నిరుపేద కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకంలో భాగంగా వదలపర్తి గ్రామంలో 11 ఇండ్లు మంజూరయ్యాయని గ్రామ సర్పంచ్ సత్య బోయిన పద్మ నారాయణ తెలిపారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టా పత్రాలను గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ, సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్, గ్రామ కార్యదర్శి అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.