7 July, 2026 | 3:22 PM

Breaking News

హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •   ప్రతి ఓటరును చైతన్యం చేయండి   •   ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ముప్పు   •   మొహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎస్‌ఐఆర్ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ విక్టర్   •   సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •  

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

07-07-2026 02:39 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరుగు ప్రభు ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ జెండా కేవలం ఒక జెండా మాత్రమే కాదని, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం,సమాన హక్కులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సాగిన ఉద్యమానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ జెండా ఐక్యత,ధైర్యం,సేవాభావం, ప్రజాస్వామ్య పద్ధతుల్లో హక్కుల సాధన కోసం నిరంతరం స్ఫూర్తినిస్తుందని అన్నారు. అనంతరం పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ప్రజాసేవను మరింత కాలం కొనసాగించాలని ఆకాంక్షించారు.