13 April, 2026 | 1:54 AM

ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం

13-04-2026 12:00 AM

హాజరైన వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ 

తల్లాడ, ఏప్రిల్ 12. ( విజయక్రాంతి): తల్లాడ మండలం కేశ్వాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు రావిలాల త్రివేణి గోపి గృహప్రవేశానికి తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్  హాజరయ్యారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు రావడం, పేదవారి సొంతింటి కళ, నిజం చేసినందుకు చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని  అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య, ఆర్థిక,సామాజిక రంగాలలో సుస్థిరిత అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.

రానున్న కాలంలో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిత్యం  ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని కొనియాడారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు రావిలాల త్రివేణి గోపి మాట్లాడుతూ వారి సొంత ఇంటికి కలను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ విజయకుమార్ కి, ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క కి, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసినారు.

అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ ని మల్లవరం సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ ని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారితోపాటు కేశవాపురం గ్రామ ఉపసర్పంచ్ సాదం రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నంశెట్టి శ్రీనివాసరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి శ్రీకాంత్, భూక్య అంజయ్య, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.