ఇంటర్ ఫలితాల్లో 4వ స్థానంలో ఖమ్మం
72.06శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు హర్షం
ఖమ్మం, ఏప్రిల్ 12(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలను ఒకే సారి విడుదల చేయగా, ఆ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
రాష్ట్రంలోనే నాల్గవ స్థానంలో ఖమ్మం జిల్లా నిలిచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మొదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 29,856 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 22,961 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో మొదటి సంవత్సరం మొత్తం 15,299 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,025 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిగా, రాష్ట్రంలో నాల్గవ స్థానం వచ్చినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు.
అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కు మొత్తం 14,627 మంది విద్యార్థులు పరీక్షల రాయగా, 11,936 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందుకు గాను 81.60 శాతం నమోదు కాగా, రాష్ట్రంలో ఆరవ స్థానంలో ఖమ్మం జిల్లా నిలిచినట్లు రవిబాబు తెలిపారు. ఈ సంవత్సరం ఇంత మంచి ఫలితాలను అందించిన విద్యార్థులందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. అలాగే అద్యాపక బ్రుంధానికి అందరికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ లో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఖమ్మం జిల్లాను ఉంచే విధంగా పనిచేస్తామని అకాంక్షించారు.
మే 13న అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
ప్రస్తుతం ఫలితాలు విడుదల కాగా, ఆ ఫలితాలపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లే చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు. ఈనెల 13 నుంచి 20 రకు విద్యార్థి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రీకౌంటింగ్ కు ప్రతి సబ్జెక్ట్ రూ.100 చొప్పున, రీ వెరిఫికేషన్ కు ప్రతి సబ్జెక్ట్ కు రూ.800చొప్పున ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు వచ్చే నెల 13 నుంచి నిర్వహిస్తారని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన విద్యార్థులు ఈనెల 13 నుంచి 20 వరకు కాలేజీల పరీక్ష పీజు చెల్లించాలని సూచించారు.
మూడేళ్ల నుంచి ఫలితాలు ఇలా
మొదటి సం.. హాజరైన విద్యార్థులు పాసైన విద్యార్థులు శాతం
2024 16015 10224 63.84
2025 15584 11088 71.15
2026 15,299 11025 72.06
రెండవ సం.. హాజరైన విద్యార్థులు పాసైన విద్యార్థులు శాతం
2024 14,564 10,806 74.20
2025 14,876 11,557 77.60
2026 14,627 11,936 81.60




