calender_icon.png 21 February, 2026 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ పథకంతో పేదలకు ఆనందోత్సాహం

21-02-2026 12:43:40 AM

ఇల్లందు, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామపంచాయితీలో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారురాలు పొలెబోయిన భాగ్యాలు కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహంలోకి ప్రవేశం చేశారు.

ఈ సందర్భంగా అర్హులైన పేదలకు సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ పథకం అమలు కొనసాగుతోందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో పథకాన్ని మరిన్ని విడతలుగా అమలు చేసి ఇంకా అనేక కుటుంబాలకు ఇళ్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.

పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పాయం లలిత భార్గవ్, మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్, ఉప సర్పంచ్ ఆదిత్య, మడుగు సాంబమూర్తి, బండి ఆనంద్, ఈసం లక్ష్మణ్, రాకేష్, నవీన్, వికాస్, రాము, యల్లయ్య, మాజీ సర్పంచ్ కల్తీ పద్మ, గాలిపల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు.