calender_icon.png 21 February, 2026 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి

21-02-2026 12:42:43 AM

  1. జిల్లా సంక్షేమ అధికారిణి డి. పద్మ

మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా.. గురుకుల పాఠశాల సందర్శన

బోధన్, ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి): ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా మండల అధికారులు సమన్వయంతో పని చేయాలని నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి (ౄWO), సాలురా మండల ప్రత్యేక అధికారి డి. పద్మ సూచించారు. శుక్రవారం ఆమె సాలురా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన తనిఖీ:

సమీక్ష అనంతరం ఆమె సాలురా మండలంలోని పలు విద్యాసంస్థలను సందర్శించారు. అచ్చన్పల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (MJPTBCWRS) ను సందర్శించి, అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు.

అనంతరం సాలురా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆదేశించారు.

వైద్య సేవలు మెరుగుపరచాలి:

సాలురా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) తనిఖీ చేసిన ఆమె, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వచ్చే సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాలురా ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజీ మంజుష, ఎంజేపి పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్వరి, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ రాజ్కుమార్, ఏపీఎం  సాయిలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగవేణి పాల్గొన్నారు. అలాగే వివిధ శాఖల ఏఈలు కళ్యాణ్ (విద్యుత్), రామ్ యాదవ్ (ఆర్.డబ్ల్యూ.ఎస్), రోహిత్ (మిషన్ భగీరథ), శివ (పి.ఆర్) తదితరులు పాల్గొన్నారు.