calender_icon.png 29 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

29-07-2025 12:54:43 AM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ 

కామారెడ్డి, జూలై 28 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగ వంతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను, అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు వేగవంతంగా నిర్మాణం చేపట్టాలన్నారు.

అనంతరం మాచరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పల్వంచలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యుల పనితీరు, రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్, డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ సాయి కిరణ్, తాసిల్దార్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.