calender_icon.png 29 July, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనేశ్వర్ జాతీయ కార్యశాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

29-07-2025 12:54:02 AM

కరీంనగర్, జూలై 28 (విజయ క్రాంతి): పారిశుధ్య కా ర్మికుల రక్షణ, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్ లో నిర్వహించిన రెండు రోజుల జాతీ యస్థాయి కార్యశాలలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. పారిశుధ్యం, ప్రజారోగ్య వ్యవస్థలకు పారిశుధ్య కార్మికులు పునాదిగా నిలుస్తున్నప్పటికీ వారు అసురక్షిత పని పరిస్థితులు, పరిమిత రక్షణలు, సామాజిక అణచివేతను ఎదు ర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సంస్కరణల తక్షణ అవసరాన్ని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం భువనేశ్వర్ లో కార్యశాల నిర్వహించింది. పారిశుద్ధ్య పనులలో భద్రత, రక్షణ, పారిశుద్ధ్య కార్మికుల గౌరవం పెంచేందుకు ఇతర రాష్ట్రాలు, సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యశాలలో చర్చించారు. పారిశుధ్య కార్మికుల భద్రతకు కరీంనగర్ లో తీసుకుంటున్న చర్యలను భువనేశ్వర్ జాతీయ కార్యశాలలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వివరించారు.

జిల్లాలో యూనిసెఫ్ సంస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్మికుల భద్రతా చర్యలను గురించి తెలియజేశారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆరోగ్య కార్డులు అందచేశామని, తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను రికార్డు చేశామని తెలిపారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు అందజేస్తున్నామని అన్నారు.

ముఖ్యంగా మహిళా కార్మికులకు ఈ విధానం వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. స్క్రీనింగ్ పరీక్షల్లో ప్రమాదకర వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స అందించి వారిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని సూచించారు. కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పమేలా సత్పతివివరించారు.