30 June, 2026 | 10:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మూడు నెలలలోగా ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలి

06-06-2025 12:57 AM

 సిరిసిల్ల, జూన్ 5 (విజయక్రాంతి):ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు మూడు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. గురువారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆయా మండలాల లబ్ధిదారులు కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు విచ్చేయగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ వీరితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. పేదలు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. మంజూరు పత్రాలు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తుందనివివరించారు.