30 June, 2026 | 11:03 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పోరండ్లలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్

06-06-2025 01:00 AM

తిమ్మాపూర్,  జూన్ 5 విజయక్రాంతి:  ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ లోహియా ఎడిబిలయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో ఆ యిల్ పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించి ఆయిల్ ఫామ్ మొక్కలు ప్లాంటేషన్ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వరి పంటకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ పంట వేసుకోవాలని సూచించారు. ఒక టన్ను పామ్ ఆయిల్ గెలల ధర రూ.. 20,058/- ఉందని ఒక ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందని సంవత్సరానికి లక్షకు పైగా ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ప్రతి రైతు వరి నుండి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ సాగు చేయాలని రైతులను కోరారు ఈ కార్యక్రమంలో  మానకొండూర్ ఉద్యానవనాధికారి బి రవళి, లోహియా ఎడిబిల్ ఆయిల్స్ మేనేజర్ కే. విజయ భరత్, ఏఈఓ పూర్ణచందర్, ఫీల్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఆయిల్ పామ్ రైతులు చీటీ రాజేశ్వరరావు, విజయకుమార్, గడ్డం సంతోష్ రెడ్డి, సింగిరెడ్డి నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.