18 April, 2026 | 11:05 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామికవాడలు

30-04-2025 12:48 AM
  1. పరిశ్రమలు ఏర్పాటు చేసేలా యువతకు ప్రోత్సాహం
  2. ‘మొబిలిటీ వ్యాలీ పార్క్’ భూమి పూజలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): తెలంగాణను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిం చారు. వీటిల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ఏ ర్పాటు చేసేలా తెలంగాణ యువతను ప్రోత్సహిస్తామన్నారు.

రూ. 44.3 కోట్లతో టీజీఐఐసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎనకవత గ్రామం లో ‘మొబిలిటీ వ్యాలీ పార్క్’ను అభివృద్ధి చేయడానికి శ్రీధర్‌బాబు మం గళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 862 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఈ పార్క్ ద్వారా దాదాపు 10 వేలమంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

పరిశ్రమలు కేవ లం హైదరాబాద్‌కే పరిమితం కా కుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల ను మరింత బలోపేతం చేసేందుకే ప్రత్యేక పాలసీని తీసుకొచ్చినట్టు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  పారిశ్రామికవేత్తలు ముందుకొస్తుంటే కొందరు కావాలనే పనికట్టుకుని ప్రభుత్వంపై దు ష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే త ప్పుడు ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కా ర్యక్రమంలో స్పీకర్ గడ్డంప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మ లా జగ్గారెడ్డి పాల్గొన్నారు.