సాంకేతికంగా బలహీనమే
గతవారం డెయిలీ చార్టుల్లో నిఫ్టీ రైజింగ్ చానల్ నుంచి బ్రేక్‌డవున్ కావడం బేరిష్ సెంటిమెంట్‌ను సూచిస్తున్నదని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ రూపక్ డే విశ్లేషించారు. ఈ కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్ ట్రెండ్ బలహీనంగానే ఉంటుందని, నిఫ్టీ 22,200 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని చవిచూస్తుందని అంచనా వేశారు. నిఫ్టీ ఈ దిగువన ఉన్నంతవరకూ ప్రతీ పెరుగుదలలోనూ అమ్మకాల ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. 21,950 పాయింట్ల వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని కోల్పోయి ముగిస్తే మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతాయని అంచనా వేశారు. నిఫ్టీ తదుపరి దిశను గుర్తించాలంటే శుక్రవారంనాటి 22,131 పాయింట్ల గరిష్ఠాన్ని దాటేవరకూ లేదా 21,950 కనిష్ఠస్థాయిని కోల్పోయేవరకూ వేచిచూడాలని జేఎం ఫైనాన్షియల్ టెక్నికల్ రీసెర్చ్ తేజాస్ షా సూచించారు. ఈ వారం నిఫ్టీ 21,950 స్థాయిని కోల్పోతే 21,700 వరకూ తగ్గవచ్చని, 22,200 వద్ద ఉన్న అవరోధాన్ని దాటితే 22,500 పాయింట్ల వరకూ పెరగవచ్చని అంచనా వేశారు. అయితే మొత్తంమీద ట్రెండ్ నెగిటివ్‌గా నే ఉన్నదన్నారు.






