27 June, 2026 | 5:48 PM

ఇన్ఫోసిస్ సీఈవో జీతం పెరిగింది

04-06-2024 12:16 AM

న్యూఢిల్లీ, జూన్ 3: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సలీల్ పరేఖ్ జీతం భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆయనకు 17.3 శాతం మేర జీతం పెంచినట్టు కంపెనీ వర్గా లు వెల్లడించాయి. ఇప్పటివరకు ఆయన వార్షిక వేతనం రూ.56.4 కోట్లు తీసుకుంటుండగా, తాజా పెరుగుదలతో ఆయన జీతం రూ.66.2 కోట్లకు పెరిగింది. అయితే గతేడాది ఆయన జీతం 21 శాతం మేర తగ్గింది. అంతకుముందు సంవత్సరం రూ. 71.02 కోట్లు ఉండగా, అది కాస్తా రూ.56.4 కోట్లకు తగ్గింది.