27 June, 2026 | 7:02 PM

Breaking News

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •   శ్రీరంగవరం పట్టణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టోత్సవం   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ 15వ గ్రాడ్యుయేషన్ డే   •   స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 43 పాఠశాలలకు నోటుబుక్స్ పంపిణీ   •  

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్

04-06-2024 12:13 AM

తగ్గిన బంగారం, వెండి ధరలు

ముంబై, జూన్ 3: పసిడి ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దీంతో ఆభరణాల ప్రియులు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దాటుతుందన్న అంచనాలకు బ్రేక్ పడుతోంది. వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గింది. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 72,110గా ఉంది. ఇక, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.66,100 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధర కూడా వరుసగా తగ్గుముఖం పడుతోంది. కేజీ వెండి ధర ఒక్క రోజులోనే రూ.700 తగ్గింది. దీంతో  ప్రస్తుతం మార్కెట్‌లో వెండి ధర రూ.97,300 గా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు ఇలాగే తగ్గుముఖం పడుతాయని కచ్చితంగా చెప్పలేం.