కర్ణాటకలో అమానుష ఘటన
- 14 ఏండ్ల చిన్నారికి 29 ఏళ్ల వ్యక్తితో పెండ్లి
- బలవంతంగా అత్తారింటికి ఎత్తుకెళ్లిన వైనం
- కిడ్నాప్‌లా భావించి పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
బెంగళూరు, మార్చి 7: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన జరి గింది. తమిళనాడులోని హోసూరు తొట్టమంజు ప్రాంతానికి చెందిన ఓ 14 ఏండ్ల బాలికకు బలవంతంగా వివాహం చేశారు. ఏడో తరగతి వరకు చదివిన ఆ బాలిక ప్రస్తుతం ఇం ట్లోనే ఉంటోంది. బాల్యవివాహాలు చేయొద్దని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా కానీ కొంత మంది మాత్రం మదమెక్కి వ్యవహరిస్తున్నారు.
కర్ణాటకకు చెందిన 29 సంవత్సరాల కూలీతో ఆ బాలికకు వివాహం జరిపించారు. ఈ ఘటన మార్చి మూడునే జరిగినా కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహం వద్దని ఎంత మొత్తుకున్నా కానీ ఆమె తల్లిదండ్రులు వినలేదు. పెండ్లి తర్వాత భర్తతో కలిసి సొంతూరుకు వచ్చేందుకు అలాగే.. అక్కడి నుంచి అత్తారింటికి వెళ్లేందుకు కూడా ఆ బాలిక అభ్యంతరం తెలిపింది.
దీంతో పెండ్లి కొడుకు మాదేశ్, ఆయన అన్న మల్లేశ్ (38) ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ బాలికను కిడ్నాప్ చేస్తున్నారని అనుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి.. మాదేశ్, మల్లేశ్, బాలిక తల్లి, తండ్రి, మల్లేశ్ భార్య తదితరులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే వారికి రెండేండ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంది.






