7 May, 2026 | 7:48 AM

‘పాలమూరు-రంగారెడ్డిపై’ సుప్రీంలో విచారణ

08-03-2025 12:00 AM
  1. అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన నాగం జనార్దన్‌రెడ్డి
  2. విచారణ మే నెలకు వాయిదా వేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ, మార్చి 7 : రాష్ట్రంలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గతేడాది డిసెంబర్‌లో బీహెచ్‌ఈఎల్ అఫిడవిట్ దాఖలు చేసింది. 

ఎత్తిపోతల పథకానికి సంబంధించి సరఫరా చేసిన యంత్రాలు, తమకు వచ్చిన బిల్లుల వివరాలను దానిలో పేర్కొంది. బీహెచ్‌ఈఎల్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయాలు తాము చేసిన ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వ టెండర్‌లో మూడో వంతు కూడా బీహెచ్‌ఈఎల్‌కు చెల్లించలేదని అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు స్ప ష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్ దా ఖలు చేసిన అఫిడవిట్, దానికి నాగం జనార్దన్‌రెడ్డి ఫైల్ చేసిన రిజాయిండర్‌లను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నా రు.

అయితే ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో మూడు పిటిషన్లు కొట్టివేశారని, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని మేఘా సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరిగాయని స్పష్టంగా కనిపిస్తు న్నందున వెంటనే దర్యాప్తునకు ఆదేశించాలని నాగం తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యా యస్థానానికి విజ్ఞప్తి చేశారు.

సవివరంగా వాదనలు విన్న తర్వాత నిర్ణ యం తీసుకుంటామని ధర్మాస నం స్పష్టం చేసిం ది. తదుపరి విచారణను మే 13 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.