24 June, 2026 | 2:09 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

ముద్రా రుణాల మంజూరులో అన్యాయం

10-05-2026 01:02 AM

తెలంగాణ రైతు రక్షణ సమితి

ముషీరాబాద్, మే 9 (విజయక్రాంతి): ముద్రారుణాల మంజూరులో కేంద్ర ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించిందని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆరోపించింది. కేంద్ర ఆర్థికశాఖ ముద్ర రుణాల మంజూరుకై ప్రతియేటా వివిధ రాష్ట్రాలలోని బ్యాంకులకు టార్గెట్లు నిర్ణయిస్తుందని, దీనికి శాస్త్రీయ పద్దతి పాటించకుండా ఇష్టారీతిన కేంద్ర ఆర్ధికశాఖ వ్యవహరించడంతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది.

శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరి రా వు మాట్లాడుతూ ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటిస్తున్న తరుణంలో ముద్ర రుణాల మంజూరులో తెలంగాణ, ఏపీలోని చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, నిరుద్యోగ యువతకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు, ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ముద్రారుణాల మంజూరులో జాతీయ సగటుకు చేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో మరో 71 లక్షల మందికి, ఏపీలో 1.01 కోట్ల మందికి అదనంగా ముద్ర రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. సమావేశంలో నేతలు కే. రాఘ వేందర్ రెడ్డి, ఎ. వెంకటేష్, ఎం. విష్ణువర్ధన్‌శేఖర్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామాం జనేయరెడ్డి, మాణిక్యరెడ్డి పాల్గొన్నారు.