21 March, 2026 | 4:58 AM

బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం

21-03-2026 01:37 AM

ప్రభుత్వ ఆదాయ వ్యయాల పట్టిక కేవలం అంకెల కూర్పు మాత్ర మే కాదు. అది ఆ ప్రభుత్వ ప్రాధాన్యతల ను, సామాజిక బాధ్యతను చాటిచెప్పే రాజకీయ ముసాయిదా. తెలంగాణ వంటి రా ష్ర్టంలో జనాభాలో సింహభాగంగా ఉన్న వెనుకబడిన తరగతుల అభివృద్ధిపైనే రాష్ట్ర పురోగతి ఆధారపడి ఉంటుంది. తాజాగా ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి కేటాయించిన 12,511 కోట్లు ఆ సామాజిక వర్గాన్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి.

బీసీ సంఘాలు డిమాండ్ చేసిన రూ.20 వేలకోట్లతో పోలిస్తే ఇది చాలా స్వల్పం. ఈ కేటాయింపులు చూ స్తుంటే బీసీల అభ్యున్నతిపై ప్ర భుత్వానికి ఉన్న సంకల్పం కేవలం కాగితాలకే పరిమితమవుతోందనే సందేహం కలుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీల సంక్షేమం కోసం ‘బీసీ డిక్లరేషన్’ పేరుతో భారీ హామీలను ప్రకటించింది. రాష్ర్టంలో కులగణన చేపట్టి ఆ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని భరోసా ఇచ్చింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ప్రతేటా బడ్జెట్‌లోరూ.20 వేలకోట్లు కేటాయిస్తామని పేర్కొంది. ఐదేళ్లలో లక్ష కోట్ల నిధులను బీసీల అభివృద్ధి కోసం ఖర్చుచేస్తామని వాగ్ధానం చేసింది. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని, జనాభాప్రాతిపదికన నిధులను ఖర్చుచేస్తామని హామీ ఇచ్చింది. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు భారీ నిధులు కేటాయిస్తామని వెల్లడించింది.

విద్య, సామాజిక భద్రత

విద్య, సామాజిక భద్రతకు సంబంధిం చి కూడా కాంగ్రెస్ పలు కీలక వాగ్దానాలు చేసింది. ప్రతి మండలంలో ఒక బీసీ ఓబీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విదేశీ విద్యకోసం బీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. కులవృత్తులపై ఆధారపడిన వారికి ఆధునిక పరిక రాలు, తక్కువ వడ్డీతో రుణాల సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది.

వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసిన వారిని గౌరవిస్తూ మహాత్మా జ్యోతిబా ఫూలే పేరుతో ప్రత్యేక పురస్కారాలను అందజేస్తామ ని పేర్కొంది. బీసీ భవనాల నిర్మాణంతో పాటు ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను పూర్తిచేస్తామని వివరించింది. ఈ హామీలన్నీ బీసీ సామాజికవర్గాల్లో రాజకీయ, ఆర్థిక, విద్యాపరమైన మార్పే లక్ష్యం గా రూపొందించినట్లు పార్టీ వెల్లడించింది.

అంకెల్లో పెరిగి.. అమలులో వెనుక

రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ‘నీళ్లు, నిధులు, నియామకాలు‘ అనే నినాదం బీసీల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. 2014లో లక్ష కోట్లతో మొదలైన రాష్ట్ర బడ్జెట్ నేడు ౩ లక్షల కోట్లకు చేరింది. రాష్ట్ర సంపద పెరిగిన నిష్పత్తి లో బీసీల వాటా పెరగకపోవడం గమనార్హం. గత దశాబ్ద గణాంకాలను పరిశీలిస్తే చేదునిజం వెల్లడవుతోంది.

గత ప్రభుత్వ హయాంలో (2014- బీసీల కోసం రూ.44,940 కోట్లు కేటాయించగా వాస్తవంగా ఖర్చు చేసింది రూ.26,645 కోట్లు మాత్రమే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. గడిచిన రెండేళ్లలో రూ.21,600 కోట్లు కేటాయించినా క్షేత్రస్థాయిలో ఖర్చు అయింది కేవలం ఐదు వేల కోట్ల రూపాయలే కావడం శోచనీయం.

నిధుల లేమితో కార్పొరేషన్లు

బీసీ కార్పొరేషన్లు, ఎంబీసీ సంస్థలు ని ధుల లేమితో వెలవెలబోతున్నాయి. కులవృత్తుల మీద ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలకు ఆసరాగా నిలవాల్సిన స్వ యం ఉపాధి పథకాలు నిధుల విడుదల లేక నిలిచిపోయాయి. ప్రభుత్వం పెద్ద ప్రా జెక్టులకు, ఆడంబరాలకు నిధులు సమకూరుస్తున్నప్పుడు కోట్లాది మంది జీవనోపా ధికి సంబంధించిన బీసీ కార్పొరేషన్లకు ‘రెవెన్యూ పరిమితులు‘ చూపడం సామాజిక అన్యాయమే అవుతుంది. భూమి ఉన్న వర్గాలకు రైతు భరోసా, రుణమాఫీ వంటి పథ కాలు నేరుగా అందుతున్నప్పటికీ భూ మి లేని 50 లక్షల బీసీ కుటుంబాలకు బడ్జెట్‌దీతిజిజిలో సరైన ప్రత్యామ్నాయం కరువైంది.

కామారెడ్డి హామీల అమలు ఎక్కడ?

ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలు అమలుకు నోచు కోకపోవడం ప్రభుత్వ విశ్వసనీయతను ప్ర శ్నిస్తోంది. ఏటా రూ. 20 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించిన ప్రభు త్వం బడ్జెట్‌లో రూ.12,511 కోట్లు మాత్రమే కేటాయించడం హామీల ఉల్లంఘనగా కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో బీసీ విద్యార్థుల ఉన్నత చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. జ్యోతిబాఫూలే వంటి మహనీయుల పేరు తో పెట్టిన విద్యాసంస్థలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కేటాయింపుల గారడీని పక్కన పెట్టి, ప్రకటించిన ప్రతి రూపాయి సకాలంలో విడుదల చేయాలి.

చట్టబద్ధత, పారదర్శకత

జ్యోతిబాఫూలే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి జనాభానిష్పత్తి ప్రకారం బడ్జెట్ వాటా ఇవ్వాలి. కులాలవారీగా లబ్ధిదారుల డేటాను పారదర్శకంగా వెల్లడించా లి. స్తంభించిపోయిన బీసీ కార్పొరేషన్లను పునరుద్ధరించి నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధి కల్పించాలి. బడ్జెట్ అంకెలు ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో బీసీల బతుకు చిత్రం మారకపో వడానికి ప్రధానకారణం ’నిధుల మళ్లింపు’, ’నిర్వహణా లోపం’. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన నిధులు ఇతర ప్రజాకర్షక పథకాలకు లేదా రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి మళ్లించబడుతున్నాయనే విమర్శలు బలం గా ఉన్నాయి. ఇది కేవలం ఆర్థికపరమైన అంశం కాదు. ఒక సామాజిక వర్గం యొక్క హక్కులను కాలరాయడమే అవుతుంది.

స్థిరమైన అభివృద్ధే లక్ష్యం కావాలి

ప్రభుత్వాలు సంక్షేమమంటే కేవలం కొన్ని రాయితీలు ఇవ్వడమేనని భావిస్తున్నాయి. బీసీ సమాజం కోరుకుంటున్నది ‘స్థిరమైన అభివృద్ధి’. కులవృత్తులపై ఆధారపడిన వారు నేడు సాంకేతికతతో పోటీ ప డలేక ఇబ్బందులు పడుతున్నారు. చేనేత, గొర్రెల పెంపకం, గీతవృత్తి వంటి రంగాలకు బడ్జెట్‌లో కేటాయించే నిధులు ఆధు నిక పరికరాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడానికి వినియోగించాలి. బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు రాజకీయ పలుకుబడి ఉన్నవారికే కాకుండా నిజమైన లబ్ధిదారులకు అందేలా పారదర్శక విధానాన్ని తీసుకురావాలి.

శ్వేతపత్రం డిమాండ్

ప్రభుత్వం ఏటా ఖర్చుచేస్తున్న నిధులలో ఏ కులానికి ఎంత శాతం లబ్ధి చేకూ రిందో తెలిపే ‘కులవారీ శ్వేతపత్రాన్ని’ విడుదల చేయాలి. జనాభా గణన నిర్వహిం చడంలో ఆలస్యం కూడా బీసీలకు అందాల్సిన వాటాను దెబ్బతీస్తోంది. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలంటే ముందుగా శాస్త్రీయమైన గణాంకా లు ఉండాలి. ఈ బడ్జెట్‌లో ఆ దిశగా అడుగులు పడకపోవడం నిరాశకలిగించే అం శం. రూ.12,511 కోట్ల కేటాయింపు అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే కావాలి. కేటాయింపులు కాగితాలకే పరిమితం కా కుండా ప్రతి త్రైమాసికంలో నిధుల విడుదల, వినియోగంపై సమీక్ష నిర్వహించాలి.

ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు

రాజకీయ ప్రయోజనాల కోసం బీసీల ను కేవలం ‘ఓటు బ్యాంకు’గా చూడటం మానేసి వారిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. గొంతు విప్పని వర్గాలకు కూడా న్యాయం జరిగినప్పుడే తెలంగాణలో సామాజిక ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రభుత్వం తన బడ్జెట్ ప్రసంగంలోని ఆశయాలను క్షేత్రస్థాయిలో ఆచరణలోకి తెస్తుందో లేదో వేచిచూడాలి. తెలంగాణ సమాజంలో మెజారిటీ వర్గమైన బీసీలు అడుగుతున్నది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు. ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను గుర్తించి ఈ బడ్జెట్ కేటాయింపులను కేవలం అంకెలుగా మిగల్చకుండా వాటిని బీసీల జీవితాల్లో వెలుగులు నింపే ఆయుధాలుగా మలచాలి. అప్పుడే నిజమైన సామాజిక తెలంగాణ ఆవిష్కృత మవుతుంది.

 తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి, సెల్: 97017 03684