10 May, 2026 | 11:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలలో స్థానికతపై హైకోర్టులో మగిసిన విచారణ

29-08-2024 08:02 PM

హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలలో స్థానికతపై గురువారం హైకోర్టులో విచారణ ముగిసింది. సీజే ధర్మసనం తీర్పును వచ్చే వారానికి వాయిదా వేసింది. మెడికల్ సీట్లలో ప్రవేశానికి సంబంధించి గత నెల కొత్త జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివితేనే స్థానికుడిగా పరిగణిస్తూ జీవోను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఇంటర్ చదివినా స్థానికత కోల్పోతున్నారని పిటిషనర్లు వాదించారు. రాష్ట్ర విద్యార్థులకు న్యాయం జరగాలనే స్థానికతపై కొత్త జీవో తెచ్చామన్న ఏజీ తెలిపారు. రేపటిలోగా రాతపూర్వక వాదనలు సమర్పించాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.