గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: గణేష్ ఉత్సవాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించింది. ప్రభుత్వానికి, నిర్వహకులకు మధ్య సమన్యయం ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని రేవంత్ రెడ్డి తెలిపారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలన్నారు. నిమజ్జనానికి ఉత్సవ నిర్వాహకుల నుంచి సహకారం అవసరం అని, ప్రాంతాల వారీగా నిమజ్జనానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రతీ ఏరియాలో కో ఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. వీవీఐపీ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు చాలా కీలకం అని సీఎం వెల్లడించారు. రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్సన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






