1 August, 2026 | 3:47 PM

వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ నితికా పంత్ పర్యటన

01-08-2026 03:12 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్‌గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ సిర్పూర్ (టి) పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రావుపేట వంతెన, పారిగాం ప్రాంతాలతో పాటు కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద వరద పరిస్థితులను పరిశీలించారు. వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు, వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వవద్దని అధికారులను ఆదేశించారు. నదులు, వాగుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేట, పడవ ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. భద్రత కోసం రోప్‌లు, లైఫ్‌బాయ్‌లు, లైఫ్‌జాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, కౌటాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.