పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ అభివృద్ధి పనులు పరిశీలన
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మండలంలోని పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ రేట్రో ఫిట్టింగ్, ఆటస్థలం ఏర్పాటు ప్రతిపాదనలను ఎల్లారెడ్డి ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు(Irrigation EE Venkateswarlu), డిఈఈ కిష్టయ్య,కన్సల్టెంట్ పరిశీలించారు. పోచారం ప్రాజెక్టు గెస్ట్ హౌస్ అభివృద్ధి పనులకు సంబంధించి ఎల్లారెడ్డి ఈఈ వెంకటేశ్వర్లు, డిఈఈ కిష్టయ్య అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి పరిశీలన నిర్వహించారు.
ట్రెడిషనల్ లివింగ్ కన్సల్టెంట్ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న గెస్ట్ హౌస్‌ను రెట్రో పిటింగ్ విధానంలో అభివృద్ధి చేయడం, ఆటస్థలం ఏర్పాటు వంటి ప్రతిపాదిత పనులను సంబంధించిన గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని పరిశీలించారు.
పోచారం ప్రాజెక్టు అభివృద్ధి పనుల నిమిత్తం మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు కాగా గతంలో టూరిజం సంస్థకు అప్పజెప్పగా, టూరిజం సంస్థకు అభివృద్ధి పనులు ఎక్కువగా ఉండడంతో ట్రెడిషనల్ లివింగ్ కన్సల్టెంట్ వారికి ఈ పనులు అప్పజెప్పడం జరిగిందని, అందువల సోమవారం పోచారం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని మండల ఇరిగేషన్ ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు డిఈఈ కిష్టయ్య కన్సల్టెంట్ శ్వేతా రెడ్డి, ఏఈ అక్షయ్ కుమార్, సిబ్బంది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.