ఫర్టిలైజర్స్ విత్తన దుకాణాలలో తనిఖీలు
మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి, లక్ష్మీపురం గ్రామాలలోని సాయి శ్రీనివాస ఫర్టిలైజర్స్ పెసిసైడ్స్, సీడ్స్ మరియు హారిక ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ విత్తన దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి ముంజ మహేష్(Mandal Agriculture Officer Munja Mahesh) తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఆయా దుకణాలలోని మిరప, వరి విత్తనాలను పరిశీలించడం జరిగింది. విత్తనాలతో పాటు వాటికి సంబంధించిన సొర్స్ సర్టిఫికెట్, డెలివరీ చలన్, కంపెనీ జిఓటిపాస్ సర్టిఫికెట్లను, పరిశీలించడం జరిగింది.
అంతేకాకుండా రైతు వారిగా విత్తనాల బిల్లులను పరిశీలించడం జరిగింది, అంతేకాకుండా రైతులకు కనబడేలా లైసెన్సు, ధరల పట్టిక,స్టాక్ వివరాలు వుండాలి అని దుకాణం యజమానులకు సూచించారు. తర్వాత రైతు వేదిక వద్ద రైతులకు విత్తనాలు కొనేటప్పుడు తీసుకునే పలు జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా సలహాలు సూచనలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు పంచడం, రైతులు కూడా విత్తనాలు కొనేటప్పుడు బిల్లు అడిగి తీసుకొని పంట కాలం పూర్తి అయ్యేవరకు బిల్లు, విత్తన కవర్లను భద్రపరచుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్య్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి కళ్యాణి మరియు రైతులు పాల్గొన్నారు.






