23 April, 2026 | 2:03 AM

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో మొదటి స్థానం సాధించిన ఇన్స్‌పెక్టర్ సీహెచ్ వెంకటనారాయణ

23-04-2026 12:40 AM

 రాష్ట్ర డీజీపీ నుంచి ప్రశంసా పత్రం 

ములుగు (మహబూబాబాద్) ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రజలు, పోలీసు సిబ్బంది పాల్గొనే విధంగా వివిధ అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ హోదా గల పోలీసు అధికారులకు వ్యాసరచన పోటీ నిర్వహించగా ‘గ్రౌండ్ లెవల్ పోలీసింగ్ మెరుగుదలకు పోలీసు అధికారుల పాత్ర’ అనే అంశంపై ములుగు జిల్లా నుంచి ఇన్స్పెక్టర్ సి హెచ్ . వెంకటనారాయణ వ్యాసరచన ప్రథమ స్థానం పొందింది. ఈ విజయానికి గాను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా వెంకటనారాయణ ప్రశంసాపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ కేకన్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ను  అభినందించి, భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.