23 April, 2026 | 2:02 AM

ఖర్గే తీరు సరికాదు

23-04-2026 12:41 AM

జడ్చర్ల, ఏప్రిల్ 22: భారతీయ జనతా పార్టీ జడ్చర్ల మండల శాఖ మండల అధ్యక్షులు యాట రామకృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోడీని తీవ్రవాది అని సంబోధించడం సరికాదన్నారు. నిరసనగా మల్లికా ర్జున్ కర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమేష్ జి, ప్రధాన కార్యదర్శిలు జగదీశ్వర్, ఎడ్ల శ్రీనివాస్ గౌడ్,సకనీ మల్లేష్యాదవ్,గిరిజన మోర్చా మండల అధ్యక్షులు మోహన్ నాయక్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బరిగల శ్రీశైలం, ముదిరాజ్ యువ మోర్చా మండల అధ్యక్షులు గణపతి గుప్తా, ఓబిసి మండల అధ్యక్షులు శివకుమార్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు కాశన్న తదితరులు పాల్గొన్నారు.