శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి
గ్రామంపై తనకు ప్రత్యేక ప్రేమ
గ్రామం నుంచి ఖమ్మంపల్లి, మంథని వరకు డబుల్ రోడ్డు నిర్మించాం
అడవి శ్రీరాంపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపనలో రాష్ట్రమంత్రి శ్రీధర్ బాబు
ముత్తారం,(విజయక్రాంతి): శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అడవి శ్రీరాంపూర్ గ్రామం అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, తన సొంత గ్రామం కంటే ఎక్కువ ఈ గ్రామాన్ని చూసుకుంటానని, ఇప్పటికే ఈ గ్రామంలో రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా పైలట్ గ్రామంగా ప్రకటించి ఇంటింటికి ఇంటర్నెట్ ఏర్పాటు చేశామని, గ్రామము నుంచి ఖమ్మం పెళ్లి మంతిని వరకు డబుల్ రోడ్డు నిర్మించామని, రాబోయే రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
పెద్దమ్మ గుడి నిర్మాణానికి సహకరిస్తా
బతుకమ్మ చెరువు వద్ద మెట్లు కట్టిస్తా
గొల్లవాడకు రోడ్డు నిర్మిస్తా
గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు బాబు సందర్శించారు. పెద్దమ్మతల్లి గుడి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని, అలాగే గ్రామంలో నిర్మిస్తున్న శివాలయం, రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయాల నిర్మాణానికి కూడా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామంలో గొల్లవాడకు రోడ్డు లేదని ప్రజలు తెలుపగా వెంటనే నిర్మిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్, సింగిల్ విండో చైర్మన్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, నాయకులు వాజీద్ షాషా, జావిద్ పాషా, రఫి, గౌడ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






