10 May, 2026 | 11:22 AM

నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు

10-05-2026 10:15 AM

పది రోజులుగా రైల్వే క్వార్టర్స్ లో మకాం వేసిన...

తాండూరులో కలకలం.. 

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం రుక్మాపూర్ రైల్వే  క్వార్టర్స్ లో పది రోజులపాటు మకాం వేసిన నలుగురు నక్సల్స్ ను మహారాష్ట్ర, పెద్దేముల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు  చత్తీస్గడ్ రాష్ట్రానికి కు చెందిన నలుగురు నక్సల్స్ అందులో ఓ మహిళ రుక్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్వార్టర్స్ లో నివసిస్తున్నట్టు సమాచారం అందుకున్న మహారాష్ట్ర చత్తీస్గడ్ పోలీసులతోపాటు పెద్దముల్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించి  అదుపులోకి తీసుకున్నారు.

ఈ నక్సలైట్లపై మహారాష్ట్రలో కేసు ఉండడంతో వారు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా రుక్మాపూర్  రైల్వే క్వార్టర్స్ లో ఎవరికి అనుమానం రాకుండా వారం పది రోజుల నుండి కూలి పనులు చేస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సమాచారం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నక్సలైట్లను. మహారాష్ట్రకు తరలించారు. ఈ ఘటన తాండూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.