30 June, 2026 | 11:34 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!

17-04-2026 01:18 PM
  1. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి పిలిచి మాజీ ఎంపీటీసీ చేత ప్రారంభం. 
  2. పీఏసీఎస్ అధికారుల అత్యుత్సాహం
  3. అధికారులపై సర్పంచ్ రేణుక ఫిర్యాదు

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో గ్రామ మహిళా సర్పంచ్‌ కు ఘోర అవమానం జరిగింది.  గురువారం సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి రావాలని సీఈవో సిరాజుద్దీన్ ఆహ్వానించి, అనంతరం మాజీ ఎంపీటీసీ దండు నరసింహ చేత ప్రారంభం చేయించడంతో సర్పంచ్‌కు అవమానం జరిగిందని పెద్దకొత్తపల్లి గ్రామ సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాధ్యులైన పీఏసీఎస్ సీఈఓపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల ప్రత్యేక అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. ఇకముందు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్‌లను గౌరవపూర్వకంగా ఆహ్వానించి నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తనను అవమానపరిచిన వారిపై ప్రభుత్వపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు ఆదేశాలు రాకముందే సొంతంగా తామే మార్కెట్ కమిటీ చైర్మన్ లంటూ చెప్పుకొని తిరుగుతూ హంగామా సృష్టిస్తున్న వారికి సహకరించడమేంటని చర్చ జరుగుతుంది.