1 July, 2026 | 12:49 AM

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

01-07-2026 12:00 AM

పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్లు తక్షణమే చెల్లించాలి

విద్యార్థుల నుంచి వసూలు చేయొద్దు

నగరంలో కాలేజీల బంద్ విజయవంతం

హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఎంపీ ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్/ముషీరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వం పెండింగ్‌లోని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడదుల చేయాల ని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థులు తమ చేతి నుంచి ఫీజులు కట్టలేరని, విద్యా ర్థుల నుంచి ఫీజులు తీసుకోకుండానే వారికి అడ్మిషన్లు కల్పించాలని ఆయన కోరారు.

లోటు బడ్జెట్ ఉన్న ఏపీ రాష్ట్రం బకాయిలను చెల్లిస్తుంటే మిగు లు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని బకాయిలు చెల్లించలేని పరిస్థితి ఉంద ని విమర్శించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం గ్రేటర్ హైదరాబాద్‌లో కాలేజీల బంద్ విజయవంతమైందన్నారు. ఇందులో భాగంగానే మంగళ వారం చేపట్టిన హైదరాబాద్ కలక్టరేట్‌ను వందలాది మంది విద్యార్థులతో కలిసి ఆర్.కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు పగిళ్ల సతీష్, బీసీ యువజన సంఘం అధ్యక్షులు జిల్లపల్లి అంజి ముట్టడికి యత్నించారు.

14 లక్షల మంది బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు, స్కాలర్‌షిప్‌లు రూ.8 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ను వెంటనే రద్దు చేయాలని, రీయింబర్స్‌మెంట్ పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రూ.8 వేల కోట్లు బకాయిలు ఉంటే అరకొర నిధులను ప్రభుత్వం విడుదల చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఉన్నత కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, దీంతో ఉన్నత చదువులు, ఉద్యోగాలకు ఆటంకం కలుగుతుందని మండిపడ్డారు. కాంగ్రస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం రూ.10 వేల కోట్లు అప్పు తెస్తే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. ఈ ముట్టడి కార్యక్రమంలో బీసీ నాయ కులు జి.అనంతయ్య, నీల వెంకటేష్, రాజేందర్, సిద్దు యాదవ్, శివయాదవ్, మొగిలి కృష్ణ, నిఖిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.