పేకాట నిర్వాహకులు, స్థావరాలపై ఇంటెలిజెన్స్ ఆరా..!

08-09-2026 | 06:27pm

అడ్డాలు ఎక్కడ..? నిర్వాహకులు ఎవరు..? కదలికలపై నిఘా...

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లోని బాన్సువాడ పరిసరాల్లో రెచ్చిపోతున్న పేకాట మాఫియా అనే కథనం విజయ క్రాంతిలో ప్రచురితమైన కథనానికి, వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.పేకాట నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్వాహకులు, జూదం సాగుతున్నట్లు చెబుతున్న స్థావరాల వివరాలపై ఇంటెలిజెన్స్(Intelligence ) వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పేకాటకు అడ్డుకట్ట వేసేందుకు స్థావరాలు, నిర్వాహకుల కదలికలు, నిర్వహణ తీరుపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పేకాట నిర్వాహకుల్లో కలవరం మొదలైనట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.ఇంటెలిజెన్స్ ఆరాతో ఇకనైనా పేకాటకు చెక్ పడుతుందా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు