calender_icon.png 4 December, 2024 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘాటి.. యాక్షన్ మేటి

08-11-2024 12:00:00 AM

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఓ కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్న కొత్త చిత్రానికి ‘ఘాటి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నటిస్తున్న నాలుగో సినిమా కూడా. దీన్ని రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కేవలం ఒప్పు, తప్పు గురించే కాదు..

నిజమైన లెజెండ్స్ పుట్టే గ్రే ఏరియాల స్టొరీతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. దర్శకుడు క్రిష్.. అనుష్కను పూర్తి యాక్షన్ రోల్‌లో చూపించనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. అనుష్క పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ మేకర్స్.. ‘ఘాటి’లోని ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం ఉదయం విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్ అనుష్క పాత్రకు సంబంధించి కొత్త అవతార్‌ను ప్రజెంట్ చేసింది. పోస్టర్‌లో, అనుష్క తల, చేతుల నుంచి రక్తం కారుతున్నట్టు కనిపిస్తోంది.

ఆమె నుదిటిపై తిలకంతో, బంగా స్మోక్ చేస్తూ కనిపించడం అభిమానులను సంభ్రమాశ్చర్యానికి గురిచేసింది. సాయంత్రం రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే.. అనుష్క తెరపై మరో మారు భయపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రానికి కథను చింతకింది శ్రీనివాసరావు అందిస్తుండగా, డీవోపీగా మనోజ్‌రెడ్డి కాటసాని పని చేస్తున్నారు. సంగీతాన్ని నాగవెల్లి విద్యాసాగర్ సమకూరుస్తుండగా, మాటలు సాయి మాధవ్ బుర్రా రాస్తున్నారు. అనుష్క నటిస్తున్న ‘కథనార్’ నుంచి కూడా మేకర్స్ ఆమె లుక్‌ను విడుదల చేశారు.