calender_icon.png 4 December, 2024 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రొటీన్ పాత్రలపై ఆసక్తి లేదు

08-11-2024 12:00:00 AM

ప్రముఖ నటి సమంత ‘ఖుషీ’ సినిమా తర్వాత గురువా రం ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఇక ముందు ఎలాంటి ప్రాజెక్ట్‌లలో పని చేయాలనుకుంటున్నాననే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సమంత చేతిలో ఒకే ఒక తెలుగు సినిమా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకు మించి ఆమె మరే ఇతర ప్రాజెక్ట్స్‌కూ సైన్ చేయలేదు. ప్రస్తుతం ఆమె ‘రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దీనిలో ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

అనారోగ్య కారణాలతో కాస్త బ్రేక్ తీసుకున్న మీదట సమంత హిందీ ప్రాజెక్టు లపై మొగ్గు చూపడం ఆమె కెరీర్‌లో నూతన అధ్యాయానికి దోహదపడనుంది. చూడబోతే సమంత బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నారు. సంప్రదాయ, కమర్షియల్ చిత్రాల్లో ఎప్పడు నటిస్తారని మీడియా ఆమెను అడగ్గా..

అసలు తనకు అలాంటి చిత్రాల్లో నటించాలని ఏమాత్రం లేదని తెలిపారు. రొటీన్ పాత్రలపై తనకు ఇంట్రస్ట్ లేదని తేల్చారు. తను గొప్ప నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఛాలెంజింగ్ పాత్రలలో నటించాలని ఉందని సమంత వెల్లడించారు. రక్త బ్రహ్మాండ్ పిరియాడిక్ డ్రాప్ బ్యాక్‌లో రూపొందిస్తున్నారట. దీనిలో సమంత మహారాణిగా నటిస్తున్నారట. దీనిలో ఆమె చాలా బోల్డ్‌గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.