22వ వార్డులో ముమ్మరంగా డ్రైనేజీ క్లీనింగ్
30-04-2026 01:18 AM
పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
సత్తుపల్లి ఏప్రిల్ 29 (విజయక్రాంతి): 22వ వార్డులో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం డ్రైనేజీ పూడికతీత పనులను కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా దగ్గరుండి పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, డ్రైనేజీలు పొంగకుండా ముందస్తుగా ఈ పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాకీర్, ఇమామ్, స్థానిక వార్డు సభ్యులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు.






