వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
30-04-2026 01:17 AM
జుక్కల్, మార్చి 29 (విజయక్రాంతి) : జుక్కల్ మండలంలోని పడంపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు వాగ్మారే విట్టల్ కుమారుడు గౌతమ్ రాజ్ వివాహానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతోపాటు మండల నాయకులు కూడా వివాహానికి హాజరై ఆశీర్వదించారు. వచ్చిన అతిథులకు శాలువాతో సన్మానించారు. అనంతరం అందరూ కలిసి విందును ఆస్వాదించారు. మండల నాయకులు రమేష్, మాజీ ఎంపీపీ బసవంతరావు శట్కర్, సర్పంచ్ విజయ సంజు, లక్ష్మ ణ్, వినోద్ పాల్గొన్నారు.






