నేడు ఇంటర్ ఫలితాలు
24-04-2024 01:50 AM
l రేపు జేఈఈ మెయిన్, 30న టెన్త్ ఫలితాలు ?
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి) : నేడు (బుధవారం) ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఈ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రేపు (25న) జేఈఈ మెయిన్ సెషన్ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనున్నది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు రాయనున్నారు.






