అకాల వర్షంతో తడిసిన ధాన్యం

24-04-2024 01:51:02 AM

మెదక్, ఏప్రిల్ 23(విజయక్రాంతి) : అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షాలకు తడిసి నష్టం జరుగుతున్నదని, ప్రభుత్వం కొనుగోలు త్వరితగతిన చేపడితే ఇబ్బందులు ఉండవన్నారు. సోమవారం రాత్రి జిల్లాలో రామా యంపేట, చేగుంట, నార్సింగి మండలల్లో కురిసిన వర్షానికి రోడ్ల వెంట ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ఇంకా కొనుగోలు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ధాన్యంలో తేమ ఉందని రోడ్ల వెంట ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లను చేపట్టాలని కోరుతున్నారు. జిల్లాలో సోమవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యానికి ఎక్కడ నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యం కొద్దిగా తడిసింది.