11 May, 2026 | 8:28 PM

Breaking News

అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •   ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం   •   మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి   •   ప్రజావాణికి భూకబ్జాల భాగోతం   •   ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య   •   అర్హులైన పేదలందరికీ... డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించండి   •  

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

17-03-2026 07:16 PM

ములకలపల్లి, (విజయక్రాంతి): మహిళలు స్వయం సహాయక సంఘాల నుంచి బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించినట్లయితే ఆ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేయడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి (అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు) విద్యా చందన తెలిపారు. మంగళవారం జగన్నాధపురం గ్రామ పంచాయతీ లో గల 28 స్వయం సహాయ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాల నుండి తీసుకున్న, బ్యాంకు లింకేజీ రుణాలను క్రమం తప్పకుండ చెల్లించినట్లయితే, ఆ సంఘాలకు వడ్డి లేని రుణాలు వస్తాయని, సభ్యురాలు అప్పు తీసుకొని సహజంగా మరణించినచో రెండు లక్షల భీమా, ప్రమాదము జరిగి మరణించినచో పది లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉందని, అలాగే ఆసక్తి ఉన్న సభ్యులు జీవనోపాదులు ఏర్పాటు చేసుకోనుటకు  పి ఎం ఎఫ్ ఎం ఈ   పి ఎం ఎం జి పి  స్కీంల ద్వారా 35% సబ్సిడీ లతో రుణాలు మంజురు చేస్తామని తెలియ చేసారు.

జగన్నాధపురంలో  20 సంఘాలు నెల, నెల అప్పు చెల్లించకుండా క్రానిక్ సంఘాలు గా ఎందుకు ఉన్నాయి?ఎందుకు కట్టలేక పోయారని?సభ్యురాలి వారీగా మాట్లాడుతూ ఈ వారం రోజులలో బకాయిలలో సగం అమౌంట్ తప్పకుండ కట్టాలని ఈ విషయం లో ఎవరైన నిర్లక్ష్యం గా ఉన్న కఠిన చర్యలు తీసుకొని, రికవరీ తప్పకుండ చేపిస్తామని తెలియచేసారు.ఈ కార్యక్రమం లో డీపీఎం -సమ్మక్క, ఏపీఎం రామ్ కుమార్, సీసీ లు, స్త్రీనిధి ఏ ఎం , వివో ఏ లు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.