27 May, 2026 | 2:59 AM

టీజీడబ్ల్యూఆర్‌సీలో ఇంటర్ ప్రవేశాలు

27-05-2026 01:58 AM

కేసముద్రం, మే 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం నేరుగా విద్యార్థినుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్ సిఓ పీ.రత్నకుమారి, ప్రిన్సిపల్ కే. హర్షి త తెలిపారు.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీఈసీలో 17 ఖాళీలు ఉన్నాయని, ఇందులో 15 ఎస్టీ, 1 స్పోరట్స్, 1 అర్ఫాన్, హెచ్‌ఈసీలో 30 ఖాళీలు ఉన్నాయని, ఇం దులో 27 ఎస్టీ, 1 ఓసీ, 1 స్పోరట్స్, 1 అర్ఫాన్ కు కేటాయించినట్లు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినిలు ఒరిజినల్ టీసీ, ఎస్‌ఎస్సి మెమో, స్టడీ, కులం, ఆదాయం, నివా స  సర్టిఫికెట్లతో పాటు నాలుగు పాస్ ఫోటో లు, ఆధార్ కార్డు, అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ సెట్లు రెండు చొప్పున తీసుకొని కళాశాలలో అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు.