సర్వర్ సమస్యతో నిలిచిన రిజిస్ట్రేషన్లు
27-05-2026 01:58 AM
షాద్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
షాద్నగర్ మే 26 (విజయక్రాంతి): షాద్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల కోసం ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన బాధితులు గంటల తరబడి ఎదురుచూసినా పనులు జరగక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
భూముల రిజిస్ట్రేషన్లు, ధృవపత్రాల సంబంధిత సేవలు, ఇతర ఆన్లైన్ ప్రక్రియలు సర్వర్ సమస్య కారణంగా నిలిచిపోయాయని సిబ్బంది తెలిపారు. సాంకేతిక లోపాన్ని త్వరితగతిన పరిష్కరించి సేవలను పునరుద్ధరిం చాలని ప్రజలు కోరుతున్నారు. తరచూ సర్వర్ సమస్యలు తలెత్తడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఆలస్యమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






