calender_icon.png 19 December, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ లో 3వ అంతర్జాతీయ సమావేశం

19-12-2025 10:04:52 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ లో అడ్వాన్సెస్ పై 3వ అంతర్జాతీయ సమావేశంను అనురాగ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ డీఎస్ విభాగం స్ప్రింగర్ సహకారంతో నిర్వహిస్తుంది. కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ యొక్క విస్తృత డొమైన్‌లో పరిశోధకులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, ఇంజనీర్లు వినూత్న ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి కొత్త పరిశోధన ఫలితాలను ప్రదర్శించడానికి ఒక శక్తివంతమైన వేదికను అందించడం లక్ష్యం. 

దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు పరిశోధనా సంస్థల పరిశోధకులు ఈక్రింది రంగాలలో పరిశోధన, ఇటీవలి పరిణామాలను నివేదించే 360 మాన్యుస్క్రిప్ట్‌లను సమర్పించారు. కేవలం 39 పరిశోధనా పత్రాలు మాత్రమే ఆమోదించబడ్డాయి. ఈకార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం చైర్మన్ డాక్టర్ పి. రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ యు. బి. దేశాయ్, ఛాన్సలర్, సీఈఓ ఎస్. నీలిమ, డాక్టర్ అర్చన మంత్రి, వైస్ ఛాన్సలర్, డీన్ లు డాక్టర్ వి. విజయ కుమార్, డాక్టర్ జి. విష్ణు మూర్తి, డాక్టర్ సి. రాఘవేంద్రరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, కన్వీనర్. డాక్టర్ జి. బాలకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ఎం. శ్రీదేవి, అసోసియేట్ ప్రొఫెసర్, పాల్గొన్నారు.